30-08-2025 06:02:00 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని సంగెం గ్రామంలోని భీమ లింగాన్ని తాకుతూ వలిగొండ మండలంలోని పలు గ్రామాల మీదుగా జీవనది మూసీ నది పరుగులు తీస్తుంటుంది. ఎన్నో పశుపక్ష్యాదులకు, వైవిధ్యభరితమైన జీవరాశులకు నిలయమైన మూసీ నది తన ప్రవాహంలో ఎన్నో మలుపులు తిరుగుతూ సుందర దృశ్యంగా పలుచోట్ల కనిపిస్తుంది.
అటువంటి మూసీ నది వలిగొండ గుట్ట పక్క నుండి వంతెనల క్రింది నుండి ప్రవహించే అద్భుత జల దృశ్యాన్ని నక్షత్ర డిజిటల్ ఫ్లెక్సీ కి చెందిన ఔత్సాహికులు డ్రోన్ కెమెరా ద్వారా అద్భుతంగా చిత్రీకరించారు. వలిగొండ గుట్ట ప్రక్కనుండి ఇరువైపుల పచ్చని పంట పొలాల మధ్య నుండి గలగల పారే మూసీ నది వలిగొండ వంతెనల కింద ప్రవాహాన్ని చిత్రీకరించి వాట్సప్ గ్రూపులలో పోస్ట్ చేయడంతో కొద్దిసేపటిలోనే వైరల్ గా మారి ఎంతోమంది వీక్షించి మూసి అద్భుత జలదృశ్యాన్ని చిత్రీకరించిన వారిని అభినందించారు.