30-08-2025 06:04:44 PM
వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): నూగురు సబ్ సెంటర్ పరిధిలో గల చిరతపల్లి గిరిజన బాలికల వసతి గృహం నందు అధికారుల ఆదేశాల మేరకు వైద్య శిబిరం శనివారం నిర్వహించారు. శిబిరంలో పరీక్షించుకున్న వారిలో ఒక్కరికి జ్వరం, రక్తపూత సేకరణ, ఆర్డిటి నిర్ధారణ పరీక్షలు చెయ్యటం జరిగింది. విద్యార్థులకు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఉతికిన, ఎండిన తర్వాత దుస్తులు ధరించాలని తెలియపరచడం జరిగింది. కాచి చల్లార్చి నీళ్లు తాగాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు పరీక్షలు చేసి దగ్గు, జలుబు ఉన్నవారికి మందులు వసతి గృహం ఏఎన్ఎం సరస్వతికి మందులు అందజేయడం జరిగింది.
వంటశాలను సందర్శించి సరుకులు భద్రపరిచే గదిని పరిశీలించడం జరిగింది. విద్యార్థులు భోజనం తినే ముందు సబ్బుతో చేతులు కడుక్కొని ఆహారం తీసుకోవాలని తెలిపారు. హాస్టల్ వార్డెన్ ఉషా, సుజన్ కుమార్. టీచర్స్ వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్ హెచ్ పి డాక్టర్ ఆశిష్ హెచ్ఈఓ కోటిరెడ్డి, ఏఎన్ఎంలు స్వరూప, సరస్వతి ఆశ వర్కర్లు పాల్గొన్నారు.