05-08-2025 05:41:36 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను వెంటనే పార్లమెంట్లో చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు పార్లమెంటులో వెంటనే చట్టం చేయాలని బీసీ రిజర్వేషన్ల అమలుపై నోరు మెదపకుండా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న బిజెపి తెలంగాణ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ ప్రధానమంత్రిని అని చెప్తున్న నరేంద్ర మోడీ 42 శాతం బీసీ రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ నిరంతరం బీసీ అని చెప్పుకునే ఈటల రాజేందర్ లు నోర్లు ఎందుకు మెదపడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.