09-10-2025 12:26:16 AM
‘ప్రజావాణి’ ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన హైడ్రా కమిషనర్
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 8 (విజయక్రాంతి): నాలాలు, చెరువుల కబ్జాలపై ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉద యం 10 గంటలకు ప్రారంభమైన ఆయన పర్యటన, రాత్రి 7:30 గంటల వరకు ఏకబిగిన కొనసాగడం అధికారులనూ, స్థానికుల నూ ఆశ్చర్యపరిచింది. తూంకుంట మున్సిపాలిటీ, శేరిలింగంపల్లి మండలాల్లోని పలు వివాదాస్పద ప్రాంతాల్లో పర్యటించి, ఆక్రమణల తొలగింపునకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరాయాంజాల్ గ్రామానికి చేరుకు న్న కమిషనర్, సర్వే నంబర్లు 135, 136లలో రహదారి ఆక్రమణ వివాదంపై హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. అదే మా ర్గంలో నూతన కోర్టు భవనం, ట్రాఫిక్ పోలీ స్ స్టేషన్ నిర్మాణాలు రానున్నందున, ప్రజా రవాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా రహదారిని వెంటనే పునరుద్ధరించాలని ము న్సిపల్ అధికారులను ఆదేశించారు.
తుర్కవాణి కుంట నుంచి దేవరాయాంజాల్ చెరు వుకు వెళ్లే వరద కాలువ నాలా ఆక్రమణలను పరిశీలించారు. ఈ నాలాను కబ్జా చేయడంతో తమ నాలుగు కాలనీలు ఏటా వానాకాలంలో నీట మునుగుతున్నాయని స్థానికులు కమిషనర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ రికార్డులు, సర్వే ఆఫ్ ఇండి యా, ఎన్‌ఆర్‌ఎస్‌సీ మ్యాపుల ఆధారంగా నాలా వాస్తవ వెడల్పును గుర్తించి, ఆక్రమణలను తక్షణమే తొలగించాలని ఆదేశిం చారు.
వాసవి సుచిర్ ఇండియా లేఅవుట్‌లో 9 మీటర్లు ఉండాల్సిన నాలాను కేవ లం 2 మీటర్లకు కుదించడాన్ని గమనించా రు. నల్లగండ్ల పెద్ద చెరువుకు వచ్చే వరద కాలువలను కబ్జా చేయడమే కాకుండా, చెరువు అలుగును మత్తడి మార్చి, చెరువులోనే బండ్ నిర్మించారని అపర్ణ నిర్మాణ సంస్థపై వచ్చిన ఫిర్యాదులపై ఆయన స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఈ అన్ని వివాదాలపై త్వరలోనే నిర్మాణ సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలతో ఒక సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి, శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.