19-07-2025 12:39:10 AM
న్యూఢిల్లీ, జూలై 18: కాలిపోయిన కరెన్సీ కట్టలు ఇంట్లో భారీగా బయటపడటంతో తీవ్ర వివాదంలో చిక్కు కునన జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై సు ప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన దర్యాప్తు నివేదికను సవాల్ చే స్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో న్యాయ సూత్రాలు పాటించలేదని ఆయన ఆరోపించారు.
తనను పూర్తిస్థాయిలో, పారదర్శకంగా విచారించకుండానే సుప్రీంకోర్టు మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా ఏకపక్షంగా ని ర్ణయం తీసుకొని విచారణ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. విచారణ కమిటీ కూడా సమగ్ర దర్యాప్తు చేయడంలో విఫలమైందని ఆరోపించా రు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నా యి.
ఈ సమావేశాల్లోనే జస్టిస్ య శ్వంత్ వర్మ అభిశంసన కోసం తీర్మా నం ప్రవేశపెట్టేందుకు వీలుగా ఎం పీల సంతకాల సేకరణ ప్రక్రియ ప్రా రంభించారు. లోక్‌సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతామని ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు వెల్లడించారు.