14-10-2025 01:34:53 AM
-కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ
- అభిప్రాయ సేకరణ కోసం బ్లాకుల వారీగా మీటింగులు
- ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
- చేవెళ్ల మీటింగులో బయటపడ్డ నేతల మధ్య విభేదాలు
రంగారెడ్డి /చేవెళ్ల, అక్టోబర్ 13( విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న డీసీసీ పడవుల కోసం అధిష్టానం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. ఈ నెల 13 నుంచి 18 వరకు బ్లాకుల వారీగా సమావేశాలు నిర్వహించదంతో పాటు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏఐసీసీ రాష్ర్ట ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులుగా తమిళనాడు ఎంపీ రాబర్ట్ బ్రూస్, టీపీసీసీ పరిశీలకులుగా ఎమ్మెల్సీ అడ్డంకి దయాకర్, కె. వినయ్ రెడ్డి, కొత్వాల్ అబ్దుల్లా, పి. విజయారెడ్డిలను నియమించారు.
ఈ మేరకు సోమవారం వీరి ఆధ్వర్యంలో చేవెళ మున్సిపల్ కేంద్రంలోని అట్లాస్ ఫంక్షన్ హాల్లో, శంకర్ పల్లి మండల కేంద్రంలో డీసీసీ పదవి కోసం పార్టీ ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాబర్ట్ బ్రూస్ మాట్లాడుతూ.. పార్టీ పటిష్టత కోసం అందరూ పనిచేయాలని, ఎవరికి అవకాశం ఇచ్చినా అందరూ కలికట్టుగా ముందుకెళ్లాలని సూచించారు. పార్టీలో కష్టపడే కార్యకర్తలకు సముచిత గౌరవం ఉంటుందని భరోసా ఇచ్చారు. నేతల మధ్య ఏమైనా విబేధాలు ఉంటే పరిష్కరించుకొని ముందుకెళ్లాలని హితవు పలికారు.
బయటపడ్డ విభేదాలు
నేతల ప్రసంగం అనంతరం నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తనను వేదిక పైకి ఎందుకు, ఎందుకు, పిలవలేదని, బీసీలకు న్యాయం చేయడమంటే ఇదేనా.. అని ప్రశ్నించాడు. దీంతో అక్కడే అక్కడే ఉన్న ఉన్న మండల అధ్యక్షుడు జుకన్నగారి శ్రీకాంత్ రెడ్డి కలుగు కలుగ జేసుకొని... స్థానిక ఎమ్మెల్యే కాలె యాడయ్యది ఏ పార్టీ.. అధికార పార్టీ సమావేశాలకు తమనెందుకు ఆహ్వానించడం లేదని నిలదీశారు. ఆనాడు నీవేం చేశారంటూ శ్రీనివాస్ గౌడ్ పై మండిపడ్డారు. ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. టీపీసీసీ పరిశీల -ఈ సమయంలో కొద్దిసేపు లకులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి. స్థానిక సీనియర్ నేతలు కలుగజేసుకొని శాంతింపజేశారు.
రేసులో వీళ్లే..
చల్లా నర్సింహా రెడ్డి దాదాపు 8 ఏళ్లుగా జిల్లా డీసీసీ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను టీయూఎఫ్‌ఎ డీసీ చైర్మన్ గా నియమించింది. కాగా, హైకోర్టు స్టే కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో ఏఐసీసీ రాష్ర్ట ఇంచార్జి మీనాక్షి నటరాజన్ డీసీసీ పదవుల నియామకంపై దృష్టి పెట్టారు. ఇందుకోసం మీటింగులు పెట్టి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాను 15కు పైగా దరఖాస్తులు అందాయి.
సోమవారం కూడా రాష్ర్ట పొల్యూషన్ కంట్రోల బోర్డు మెంబర్, చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దేవుని ఎర్రవల్లికి చెందిన చింపుల సత్యనారాయణ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇతనితో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి పామైన భీమ్ భరత్, టీపీసీసీ అధికార ప్రతిని గౌరీ సతీష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జీగా పనిచేసిన దీపా భాస్కర్ రెడ్డి, కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, గూడూరు శ్రీనివాస్ రెడ్డి తదితరులు డీపీసీ పదవి కోసం పోటీ పడుతున్నారు.