07-09-2025 01:18:45 AM
-వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
-సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన పనులపై సమీక్ష
సంగారెడ్డి, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): రాష్ర్టంలోని ప్రభుత్వ విద్య, వైద్య సంస్థల్లో మౌలిక వసతులు మెరుగు కోసం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లాలోని కేజీబీవీ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సిఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన మౌలిక వసతులు కల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న కేజీబీవీ, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థుల హాస్టల్ నిర్వారణకు అవసరమైన సదుపాయాల కల్పనపై సిఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో కావల్సిన వసతులపై సమగ్ర నివేదిక రూపొందించాలని, వాటి ప్రాధాన్యాన్ని అనుసరించి సిఎస్‌ఆర్ నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. సిఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన పనులను అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు.