14-11-2025 12:00:00 AM
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి
ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ‘నావార్థ్’ ప్రారంభించిన కలెక్టర్
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి) : బాలికల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు, వారి లో మానసిక ఒత్తిడిని తగ్గించే వినూత్న కార్యక్రమాలను చేపట్టాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. గురువారం నింబోలి అడ్డలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో జువెనైల్ జస్టిస్ శాఖ ఆమె నావార్థ్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ, బాలికల అభిరుచికి అనుగుణంగా వసతి గృహంలో నిరుపయోగంగా పడి ఉన్న వస్తువులతో సృజనాత్మ కంగా, ఉపయోగకరమైన కొత్త వస్తువులను తయారు చేసేలా వారికి ప్రత్యేక తర్ఫీదు అందించాలి. ఇలాంటి కార్యక్రమాలు వారిలో సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా, మాన సిక ఒత్తిడిని తగ్గించడానికి ఎంతగానో దోహదపడతాయని సూచించారు.
ఈ సందర్భం గా కలెక్టర్ బాలికలతో ముచ్చటించారు. విద్య ఒక విలువైన ఆయుధం. ఓపెన్ టెన్త్, ఇంటర్ చదువుతో పాటు, మీరు ఎంచుకున్న అంశంలో శ్రద్ధగా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. వసతి గృహంలో అందిస్తున్న కంప్యూటర్ శిక్షణ, టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్ కోర్సులతో పాటు ఈ ‘నావార్థ్’ కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
అనంతరం, కలెక్టర్ భోజనశాల, వంటగదిని పరిశీలించారు. గదులను పరిశుభ్రంగా ఉంచాలని, ఆహార పదార్థాలను రుచి చూసి, మెనూ ప్రకారం నాణ్యమై న, పౌష్టికాహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. బాలికలకు అందుతు న్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఎప్పటి కప్పుడు వారికి ఆరోగ్య పరీక్ష లు నిర్వహించాలని, వసతి గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో వసతి గృహ పర్యవేక్షకులు మైథిలి, వయోవృద్ధుల శాఖ ఏడీ రాజేందర్, జాయింట్ డైరెక్టర్ ఎఫ్.ఎం. మంజుల, వైద్యురాలు డాక్టర్ జ్యోతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.