14-11-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి): సీనియర్ జర్నలిస్ట్ మరింగంటి రంగాచారి(74) గురువారం మధ్యా హ్నం కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేటలో రంగాచారి జన్మిం చారు. 1975లో ఆంధ్రభూమి పత్రికలో జర్నలిస్టుగా చేరిన రంగాచారి దాదాపు 30 ఏళ్లపాటు అదే పత్రికలో కొనసాగారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రస్తు ం తన కుమారుడితో సైనిక్‌పురిలో ఉంటున్నారు.
ఆయన సతీమణి విజయ 1997లో కన్నుమూశారు. అయితే రంగాచారి గత ఏడాదిగా కాలే య వ్యాధితో బాధపడుతూ గురు వారం కన్నుమూశారు. అంత్యక్రియలు శుక్రవారం ఉదయం ఆల్వాల్ శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. రంగాచారికి కోకిలం సాహితీ సాంస్కృతిక సంస్థతో అనుబంధం ఉంది.