calender_icon.png 9 December, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ సమ్మిట్‌లో క్రెడాయ్

09-12-2025 02:29:52 AM

‘హైదరాబాద్ బ్రాండ్’కు, సుస్థిర పాలనకు మైలురాయి అంటూ ప్రశంస

హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్).. ఫ్యూచర్ సిటీలో జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’లో పాల్గొంది. రెండు రోజుల ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా పెట్టు బడిదారులు, పరిశ్రమ నాయకులు హాజరుకాను న్నారు. హైదరాబాద్ బ్రాండ్‌కు, సుస్థిర పాలనకు ఈ సమ్మిట్ మైలురాయి అని క్రెడాయ్ ప్రతినిధులు ప్రశంసించారు.

ఇది తెలంగాణ రియల్ ఎస్టేట్ దృక్పథంపై విశ్వాసాన్ని పెంచి, తదుపరి వృద్ధి దశకు మార్గం సుగమం చేస్తుందన్నారు. క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్ జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మి ట్ కేవలం ఒక సమావేశం కాదు, ఇది ప్రభుత్వ లక్ష్యాన్ని శక్తివంతంగా ప్రకటిస్తుంది అన్నారు. ఇటీవల నిర్వహించిన ప్రధాన భూముల వేలం లో రికార్డు ధరలు పలకడం కూడా పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనం, ఇది హైదరాబాద్ తదుపరి వృద్ధి దశను ముందుకు నడిపిస్తుంది అన్నారు.

క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ -ఎలక్ట్ బి జగన్నాథ్‌రావు మాట్లాడుతూ.. “ఈ సమ్మిట్ విజయం ‘బ్రాండ్ హైదరాబాద్’పై అపారమైన విశ్వాసానికి నిదర్శనం. ము ఖ్యంగా భారత్ ఫ్యూచ ర్ సిటీలో ప్రకటించిన మల్టీ-బిలియన్ డాలర్ల పెట్టుబ డులు, ప్రపంచ వ్యాపార నాయకులను ఆకర్షించే ప్రయత్నాలతో కలిపి, నగరం వృద్ధికి శుభసూచకంగా ఉన్నాయి’ అన్నారు.

క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ క్రాంతి కిరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. “ప్రకటించిన పెట్టుబ డుల స్థాయి, ఐటీ, తయారీ, వినోదం, లాజిస్టిక్స్, మరిన్ని రంగాలలో గణనీయమైన ఉద్యోగాల సృష్టిని వాగ్దానం చేస్తుంది. క్రెడాయ్ హైదరాబాద్ ప్రభుత్వ దూరదృష్టి ప్రణాళికతో ఏకీభవి స్తూ, తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు పయనిం చడానికి తోడ్పాటును అందిస్తుందన్నారు.