22-12-2025 12:25:26 AM
నిజామాబాద్, డిసెంబర్ 21 (విజయ క్రాంతి): చింతకుంట క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిజామాబాద్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం ప్రారంభించారు. చింతకుంట క్రికెట్ బోర్డు ఛైర్మెన్ యం డి ఆరీఫ్ ఆధ్వర్యంలో చింతకుంట సర్పంచ్ వంగ నీలిమ సాయ గౌడ్, శ్రీ ఇస్మాయిల్ సహకారంతో ఏర్పాటు చేసిన క్రికెట్ బోర్డు సభ్యులను పోచారం అభినందించారు. ఈ సందర్బంగా మొదటి మ్యాచ్ ఇరు జట్ల కెప్టెన్ ల సమక్షంలో టాస్ వేసి మ్యాచ్ కొనసాగించారు.టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతి రూ 33,333/- ,రెండవ బహుమతి రూ 15,555/- అని టోర్నమెంట్ ఆర్గనైజర్లు ప్రకటించారు.