calender_icon.png 10 January, 2026 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

09-01-2026 04:11:28 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో క్రికెట్ టోర్నమెంట్ మండల బిజెపి నాయకురాలు మీరాతాయి ఆధ్వర్యంలో శుక్రవారం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నీలం చిన్న రాజులు ముఖ్యఅతిథిగా రావడం జరిగింది. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ మరియు మండల బిజెపి సీనియర్ నాయకులతో కలిసి ప్రారంభించారు. రెండు రోజులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని గెలుపొందిన విద్యార్థులకు మొదటి బహుమతిగా 7777,రెండో బహుమతి 5555 ఇవ్వడంతోపాటు క్రీడాలో పాల్గొన్న క్రీడాకారునికి మెడల్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మాన్ అఫ్ ది సిరీస్ ఉత్తమ క్రికెటర్ ఉత్తమ బౌలర్ ఉత్తమ ప్రేక్షకులకు టీషర్ట్లు,షీడులను అందజేయడం జరుగుతుందన్నారు.