calender_icon.png 10 January, 2026 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా మాంజా వాడితే కేసులు తప్పవు: ఎస్ఐ సురేష్

09-01-2026 04:16:08 PM

లక్షెట్టిపేట,విజయక్రాంతి: చైనా మాంజ వాడితే కేసులు తప్పవు అని ఎస్ఐ సురేష్ హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని పలు దుకాణాలను ఎస్సై, సిబ్బందితో కలిసి తనిఖీలు  నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ.... మండలంలో ఎవరైనా చైనామంజా వాడిన చైనామంజాను ఎవరైనా విక్రయాలు జరిపిన కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని దుకాణదారులను హెచ్చరించారు. చైనా మంజ వాడకంతో ఇప్పటికీ పలు ప్రాంతాల్లో చాలా ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోయారని ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారికి చైనా మాంజా తగిలి ఈ ప్రమాదాలు జరిగాయన్నారు.

ఇవే కాకుండా చైనా మాంజాతో గాలిలో ఎగిరే పక్షులు కూడా ప్రాణాలు కోల్పోయాయని వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చైనా మాంజాను నిషేధించడం జరిగిందన్నారు. ఎవరు కూడా చైనా మాంజా తో గాలి పటాలు ఎగరేసిన చైనా మాంజాను ఎవరైనా అమ్మినట్లు తెలిసిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని దుకాణదారులకు అవగాహన కల్పించారు.