9 April, 2026 | 2:42 AM

సాంకేతికతతో నేర నియంత్రణ

09-04-2026 12:42 AM

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఏప్రిల్ 8 (విజయక్రాంతి): నేర నియంత్రణలో టెక్నాలజీ వినియోగంతో మెరుగైన సేవలు అందించవచ్చని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా జిల్లాలో నేర నియంత్రణ,

పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా నిర్వహించబడనుందని పేర్కొన్నారు. టెక్నాలజీ వినియోగంతో పోలీసింగ్ను మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన భద్రత అందించడమే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాల మానిటరింగ్ నిర్వహించబడుతుందన్నారు.  అదనపు ఎస్పి నరేష్ కుమార్, వెల్ఫేర్ ఆర్.ఐ సంతోష్ పాల్గొన్నారు.

హోంగార్డు మృతి పట్ల సంతాపం

అనారోగ్యంతో మంగళవారం మరణించిన హోంగార్డు రంజిత్ మృతి పట్ల ఎస్పీ సంతాపం వ్యక్తం చేశారు. రంజిత్ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రంజిత్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.