9 April, 2026 | 2:42 AM

అభివృద్ధి నిరంతర ప్రక్రియ

09-04-2026 12:43 AM
  1. వడ్డేపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ 60వ డివిజన్ పరిధి వడ్డేపల్లిలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు, నగర మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ తో  కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ గత పది ఏళ్లలో వడ్డేపల్లి అభివృద్ధి కోసం ఎలాంటి కృషి జరగలేదని తెలిపారు. ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వడ్డేపల్లిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.

ఇందులో భాగంగానే ప్రభుత్వ దవాఖాన, స్మశాన వాటిక, ఇందిరమ్మ ఇండ్లు, అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు దశలవారీగా అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు.  పార్టీలకతీతంగా ప్రతి డివిజన్లో ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు. పూర్తి గ్రామీణ వాతావరణం కలిగిన వడ్డేపల్లి, న్యూ శాయంపేట, సోమిడి ప్రాంతాలను నగరంలోని ప్రధాన కాలనీలకు దీటుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో 60వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పెరుమండ్ల రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, 60,58 కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఏనుకొంటి పున్నం చందర్, తాళ్లపల్లి సుధాకర్, కాంగ్రెస్ శ్రేణులు తాళ్లపల్లి మేరీ, జనగాం శ్రీనివాస్, బస్సు నవీన్ కుమార్, మట్టపల్లి కమల్, ఎం.డి సాజిద్, పిట్టల వంశీ, భాజపా నాయకులు రోకుల సతీష్, నాగపురి అశోక్, రాజిరెడ్డి, కటకం యాదగిరి, గుండె అశోక్, అధికారులు, ప్రజలు, కాలనీవాసులు పాల్గొన్నారు.