calender_icon.png 30 August, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెక్నాలజీతో నేరాల నియంత్రణ

30-08-2025 12:00:00 AM

ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ 

మహబూబాబాద్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): నేర నియంత్రణకు ఆధునిక టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందని, పోలీసులు శాస్త్ర సాంకేతిక పద్ధతులను నేర విచారణలో వినియోగించుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ సూచించారు. జిల్లా పరిధిలోని నెల్లికుదురు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ ని ఎస్పీ ప్రారంభించారు.

అనంతరం పోలీసుల పనితీరు, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు గ్రామాల్లో ప్రజలతో స్నేహపూర్వకమైన సంబంధాలను కొనసాగించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విజబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలని ఉదయం, సాయంత్రం విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కృష్ణ కిషోర్, డిసిఆర్బిసిఐ సత్యనారాయణ, సిఐ గణేష్, ఎస్ ఐ రమేష్ బాబు సిబ్బంది ఉన్నారు.