30-08-2025 12:00:00 AM
-జిల్లాలో నత్తనడకన సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
-ఇప్పటివరకు 22 ఇళ్లు నిర్మాణం పూర్తి
-ముడి సరుకుల ధరలు పెరగడం ఒక కారణమే
నిర్మల్ ఆగస్టు 29 (విజయక్రాంతి): పేదింటి కలలను నిజం చేయడానికి ప్రజా పాలన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నత్త నడకన సాగుతోంది. ప్రభుత్వ అధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగవంతమైన చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టిన జిల్లా వ్యాప్తంగా ఇండ్ల నిర్మాణం ఆశించిన వేగం అందుకు ఒక పోవడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఓ కలగానే మిగిలిపోతుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్ల మంజూరు కోసం రూపాయలు ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించింది. దీనికోసం దరఖాస్తులను ఆహ్వానించగా జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 30 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో క్షేత్రస్థాయిలో అధికారులు అరులను గుర్తించి 82 86 ఇండ్లను మంజూరు చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన మొదటి విడుదల కేవలం 82 86 ఇండ్ల మంజూరు కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిర్మల్ జిల్లాలో 18 మండలాలతో పాటు 400 గ్రామపంచాయతీలు నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీలు ఉండగా ప్రభుత్వం అత్యంత నిరుపేదలను ఇందిరమ్మ లబ్ధిదారులుగా ఎంపిక చేసింది.
నత్త నడకన ఇండ్ల నిర్మాణం
జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసినప్పటికీ నిర్మాణంలో నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 10,500 ఇండ్ల మంజూరు గాను మొదటి విడత కింద 82 86 ఇండ్లను కేటాయించారు. వీటిలో 5100 10 ఇండ్లు మంజూరు కాగా మంజూరు గ్రీన్ సింబల్ ఇవ్వగా ఇప్పటివరకు 14 35 ఇండ్లు బేస్మెంట్ లెవెల్ 1135 గోడల్ లెవెల్ 32 స్లాబ్ లెవల్ ఇండ్లు మాత్రం నిర్వహిస్తున్నారు.
32 మందికి నిర్మాణం పూర్తి చేసుకున్నారు వారికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల నిధులను జమ చేయవలసి ఉండగా మూడు లక్షల మాత్రమే జమ చేసినట్టు బాధితులు తెలిపారు. ఇందిరమ్మ నిర్మాణంకు అవసరమ య్యే ముడి సరుకులు అయిన ఇసుక సిమెంటు ఇటుక కూలి చార్జీలు మేస్త్రీల కొడతా వర్షాలు ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. బేస్పేట్ పూర్తి అయిన తర్వాత లక్ష రూపాయలు గోడలు పూర్తయితే మరో లక్ష స్లాబు దాకా మరో లక్ష ఆ తర్వాత ఇంటి పూర్తి నిర్మాణం జరిగితే మరో రెండు లక్షలు లబ్ధిదారుని ఖాతాలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను జమ చేస్తుంది.
అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ ప్రభుత్వ నిధులు జమకపోవడంతో ఆయా గ్రామాల్లో లబ్ధిదారులు ఆర్థిక పరిస్థితి కారణంగా ఇండ్లను అభ్యంతరంగా నిలిపివేశారు. ఇందు మంజూరైన తమకు అవసరం లేదని 12 88 మంది నిరాకరించడం జరిగిందని అధికారులు తెలిపారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం సూచించిన మార్గంలోని కేటాయించిన స్థలంలోని ఇల్లు నిర్మించుకోవాలని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో చాలామంది అరులు ఉన్నప్పటికీ ఇంటి స్థలాలు లేక ఉన్న స్థలాల్లో ఇంటి నిర్మించుకోలేక ఇబ్బందికి గురవుతున్నట్టు క్షేత్రస్థాయిలో అధికారులు తెలిపారు.
వానల వల్ల మరింత జాప్యం
నిర్మల్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వానలు కూడా జాప్యానికి కారణం అవుతున్నాయి. గత రెండు నెలల నుంచి వర్షాలు కురవడంతో లబ్ధిదారులు నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇంటికి అవసరమయ్యే సిమెంటు ఇటుక రాతి తదితర ముడి సరుకులు వర్షాల కారణంగా ఇంటికి తీసుకొచ్చి అవకాశం లేకపోవడంతో పనులు జాప్యం జరుగుతుంది. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణంలో భాగస్వామ్య మేస్త్రీలు దినసరి కూలి కార్మికులు కోరుతూ ఉండడంవల్ల పనులు ముందుకు సాగడం లేదు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు చిన్న సన్నగా రైతులు పేద కుటుంబంలో ఉన్నవారు ఇంటి నిర్మాణం కంటే ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడంతో ఆ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి 15 రోజులకు సరి చేస్తున్నప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పంచుకోవడంతో అధికారులు ఇబ్బంది గురవుతున్నారు.
వర్షాలు తగ్గుముఖం పడితే కానీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతమైన అవకాశాలు లేవు. అయితే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు కొనసాగిస్తున్నప్పటికీ కొందరికి బిల్లులు రాకపోవడంతో పనులను అర్ధాంతరంగా నిలిపివేయడం కూడా కారణమని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ లబ్ధిదారులకు నిధులను మంజూరు చేయాలని పనుల్లో వేగం పెంచి లబ్ధిదారులకు అందించాలని జిల్లా ప్రజల కోరుకుంటున్నారు.