29-12-2025 12:43:54 AM
గ్రామాల్లో అభివృద్ధి పనులపై దృష్టి
కేసముద్రం, డిసెంబర్ 28 (విజయక్రాంతి): కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామంలో అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 482 గ్రామాలకు సర్పంచ్ పదవులతో పాటు వార్డు సభ్యుల ఎన్నిక జరిగింది. అలాగే ఫలితాలు వెల్లడించిన తర్వాత ఉప సర్పంచులను కూడా ఎన్నుకున్నారు. గత రెండు రోజులుగా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్‌ఎస్ పార్టీలు తాము బలపరిచిన అభ్య ర్థులు సర్పంచులుగా ఎన్నికైన నేపథ్యంలో ఘనంగా సత్కరించారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని వారికి ఆయా పార్టీల నేతలు ప్రజాప్రతినిధులు సూచించారు.
దీనితో రెండు రోజుల నుండి గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించేందుకు వీధుల్లో పర్యటిస్తున్నారు. తాగునీటి వసతి, డ్రైనేజీ, రోడ్లు, పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, అంగన్వాడి కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల నిర్మాణం తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చిస్తున్నారు.
ఇంకొందరు సర్పంచులు గ్రామాల్లో ముందుగా వీధిలైట్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. అలాగే మరి కొంతమంది సర్పంచులు గ్రామ పంచాయతీ కార్యాలయం లేని చోట మెరుగైన వసతి కోసం చర్యలు చేపట్టారు. రెండు సంవత్సరాల నుండి గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు బకాయి పడడంతో, ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కేంద్రం నుంచి పంచాయతీలకు డబ్బులు వస్తాయని భావిస్తున్నారు. ఆ మేర కు 15వ ఆర్థిక సంఘం నిధులు ఎంత మేర కు రావాల్సి ఉంది, వాటితో చేపట్టాల్సిన పనులు ఏమిటనే అంశంపై అధికారులతో చర్చిస్తున్నారు.
తాత్కాలిక పనులతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనం అందే విధంగా పనులను రూపొందించేందుకు సర్పంచులు ప్రయత్నాలు చేపట్టారు. ఈసారి సర్పంచులుగా ఎన్నికైన వారిలో అత్యధికులు విద్యావంతులు కావడం అందులో యువకులు కావడంతో రాజకీయాల పట్ల ఆసక్తి మరింత పెరిగింది. సర్పంచ్ గా ఎన్నికైన వెంటనే గ్రామాల్లో పెండింగ్ పనులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రణాళిక రూ పొందించడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.
గ్రామాల్లో సరైన రహదారి లేని చోట మెరుగైన సిమెంట్ రోడ్డు వేయడానికి కొలతలు వేసి, అధికారులకు నివేదించి అంచనా వేయించి తదుపరి నిధులు మంజూరి కోసం ప్రభుత్వానికి నివేదించే పనిలో పడ్డారు. చాలాచోట్ల గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో ప్రధానంగా నూతనంగా ఏర్పడ్డ పంచాయతీల్లో భవనాల నిర్మాణం కోసం కృషి చేస్తామని పలువురు సర్పంచులు పేర్కొన్నారు.
అలాగే తాము పదవిలో ఉండే ఐదేళ్ల కాలంలో ప్రజలకు మెరుగైన పరిపాలన అందించి, రాజకీయంగా మరింత గుర్తింపు పొందేందుకు కృషి చేస్తామని చెబుతున్నారు. ఇంకొందరు గ్రామాల్లో తాగునీటి తిప్పలు తీర్చడంతో పాటు, గ్రామాల్లో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన నీటి శుద్ధి ప్లాంట్లను అదుపులోకి తెచ్చి, అధిక ధరలకు విక్రయించకుండా అడ్డుకట్ట వేసే పనిలో నిమగ్నమ య్యారు.
పెనుగొండ గ్రామ సర్పంచుగా ఎ న్నికైన కంకల లక్ష్మి గ్రామంలో ఉన్న ప్రైవే ట్ వాటర్ ప్లాంట్ యజమానులు ఐదు రూపాయలకు 20 లీటర్ల నీరు ప్రజలకు అందిం చాలని, లేనిపక్షంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలోనే నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేసి తక్కువ ధరకు నీరు అందజేస్తామని చెప్పడంతో ఆ మేరకు వాటర్ ప్లాంట్ యజ మానులు పది రూపాయల ధరను తగ్గించి ఐదు రూపాయలకే 20 లీటర్ల శుద్ధి చేసిన నీరును సరఫరా చేస్తున్నారు.