04-10-2025 12:00:00 AM
గాంధారి అక్టోబర్ 3 (విజయ క్రాంతి): జడ్పిటిసి స్థానాన్ని బీసీ అయిన తన భార్య సరితకు కేటాయించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కి ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సర్దార్ సింగ్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం రోజున ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో శాసన సభ సభ్యులు మదన్ మోహన్ రావు కు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ గాంధారి జడ్పిటిసిగా తన సతీమణి కి కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి టికెట్ ఆశిస్తూన్న మని తమ అభ్యర్థుత్వాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు తెలియజేశారు.
ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సర్దార్ సింగ్ మదన్మోహన్ రావు రాజకీయాల్లో వచ్చినప్పటి నుండి ఆయనకు నమ్మిన భటుడుగా ఉంటూ మదన్ మోహన్ రావు గెలుపు కొరకు కృషి చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఏ విధంగా ఎవరికి జడ్పిటిసి టికెట్టు కేటాయిస్తారు అనేది మండలంలో ఆసక్తికరంగా మారింది.