calender_icon.png 18 August, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంపటిలో గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు

17-08-2025 11:42:09 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): మండల పరిధిలోని వెంపటి గ్రామంలో మహిళలు సామూహికంగా ఇంద్ర పెళ్లి ముత్యాలమ్మ, ఊర ముత్యాలమ్మ తల్లులకు ఆదివారం శ్రావణమాసం సందర్భంగా బోనమెత్తి డప్పు వాయిద్యాలతో మొక్కలు చెల్లించుకున్నారు. గ్రామంలోని వివిధ కుల సంఘాలు బోనాలను డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించారు. అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహిస్తామని గ్రామపెద్దలు మహిళల అధిక సంఖ్యలో పాల్గొని తెలిపారు.