28-07-2025 12:02:13 AM
మందమర్రి, జూలై 27 : మండలంలోని పొన్నారం జీపీ పరిధిలోనీ లబ్ధిదారులకు మంజూరైన నూతన రేషన్ కార్డులను ఎంపీడీవో ఎన్ రాజేశ్వర్ ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మం డలంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నా రు.
రేషన్ కార్డులు మంజూరు నిరంతర ప్రక్రి య అని రేషన్ కార్డులు రాని అర్హులైన వా రు ఆందోళన చెందకుండా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి హరీష్, రేషన్ డీలర్ బి లింగయ్య, ఫీల్ అసిస్టెంట్ ఈద లింగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాసు సంతోష్ కుమార్, పెంచాల రాజలింగు, నీలం ఆనం ద్, కాపురపు సతీష్, గోసిక వినయ్ కుమార్, నీలం రవి, సుధమల్ల శ్రీనివాస్, బేర నాగరా జ్, లబ్ధిదారులు గ్రామస్తులు పాల్గొన్నారు.