22-01-2026 01:37:17 AM
సికింద్రాబాద్‌లో కుబేరా సిల్క్స్ నూతన షోరూమ్ ప్రారంభం
సికింద్రాబాద్ జనవరి 21 (విజయ క్రాంతి): సికింద్రాబాద్ జనరల్ బజార్లో ప్రముఖ సిల్క్ సారీల బ్రాండ్ కుబేరా సిలక్స్ నూతన షోరూమ్ను బుధవారం ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు శ్యామ్సుందర్, శాలిని, వస్త్ర వ్యాపార రంగ ప్రముఖులు, వినియోగదారులు పాల్గొన్నారు. గత 2025 జూలై 12న ప్రారంభమైన కుబేరా సిలక్స్ కేవలం ఆరు నెలల్లోనే మూడు బ్రాంచ్లను స్థాపించి వేగవంతమైన వృద్ధిని సాధించిందని నిర్వాహ కులు తెలిపారు.
సికింద్రాబాద్ నూతన షోరూమ్లో కాంచీపురం పట్టు, బనారస్, గద్వాల్, డిజైనర్ ఫ్యాన్సీసారీల విస్తృత కలెక్షన్ను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అందించగా, కస్టమర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆఫర్లు బాగున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, రాంగోపాల్ పేట్ డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర, తదితరులు పాల్గొన్నారు.