22-01-2026 01:38:51 AM
డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్‌రెడ్డి
సికింద్రాబాద్ జనవరి 21 (విజయ క్రాంతి): బ్లూ ఫౌండేషన్, ఎనేబుల్ ఇండి యా, క్యాడర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ’సంకల్ప మేళా’ లాలాపేట్లో నిర్వహించారు. లాలాపేట్లోని జయశంకర్ క్రీడా మైదానంలో బుధవారం జరిగిన ఈ మేళాను జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి హాజరై ప్రారంభించారు. దివ్యాంగులకు సేవలందిస్తున్న స్వ చ్ఛంద సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన నిర్వాహకుల కృషిని ఆమె అభినందిం చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దివ్యాంగుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉం దని, ఆ ప్రతిభను గుర్తించి అన్ని రంగా ల్లో వారికి సముచిత అవకాశాలు కల్పించాలని సూచించారు. దివ్యాంగుల సాధికారతే సమాజ అభివృద్ధికి మార్గమని ఆమె పేర్కొన్నారు.
ఈ మేళాలో నిర్వహించిన సభలో ఎనేబుల్ ఇండియా సీఓఓ మోజెస్ చౌదరి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) డైరెక్టర్ కృష్ణమూర్తి, తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ కె. సైదులు, ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసరావు, క్యాడర్ సంస్థ డైరెక్టర్ హరిబాబు, మేనేజర్ మల్లికార్జున్, బ్లూ ఫౌండేషన్ డైరెక్టర్ వి. క్రాంతి కిషోర్, హెలెన్ కెల్లర్ సంస్థ చైర్మన్ ఉమర్ ఖాన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.