22-01-2026 01:35:38 AM
గాయపడిన ఐదేళ్ల బాలుడు
కుత్బుల్లాపూర్, జనవరి 21(విజయక్రాంతి) : సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. సూరారం మార్కెట్ మసీద్ పక్క గల్లీలో ఐదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేయడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని చికిత్స నిమి త్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు.వీధి కుక్కలను అరికట్టండని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.