26-08-2025 12:30:09 AM
- అనంతగిరిలో పర్యటించిన రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
వికారాబాద్, ఆగస్టు 25( విజయక్రాంతి)అనంతగిరి పర్యాటక ప్రాంతాన్ని అభి వృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ మరియు సాంస్కృతిక, పు రావస్తుశాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు అన్నారు. వికారాబాద్ జిల్లా కు మం త్రి చేరుకున్నందున జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు.
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణ రావు అనంతగిరి హరిత రిసారట్స్ మరియు అ నంతగిరి వ్యూ టవర్ ప్రాంతాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హరిత హోటల్ ను పైలెట్ ప్రాజెక్ట్ క్రింద పరిగణిస్తూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు అప్పగించినట్లు తెలిపారు. ప్రైవేట్ రిసారట్స్ అందించే సౌక ర్యాలకు ఏమాత్రం తగ్గకుండా హరిత హోట ల్ ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చే యాలని మంత్రి స్పష్టం చేశారు.
వచ్చే టూరిస్టులకు సౌకర్యం కల్పించాలని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని , హ్యాండ్ ఓవర్ చేసి వచ్చే టూరిస్ట్ లకు మం చి ఆహారం, అత్యాదునిక సౌకర్యాలను క ల్పించాలని ,యువతీ యువకులకు ఉపాధి కల్పించే విధంగా హరిత హోటల్ ను అప్పగించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ అభివృద్ధి ద్వారా వికారాబాద్ మరియు పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించడం తో పాటు, ప్రభుత్వానికి ఆదాయము చేకూ ర్చే విధంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేసారు.
జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకొని, హరితహోటల్ ను అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. పర్యాటక దృష్టిలో వికారాబాద్కి ఉన్న ప్రత్యేకతను ఉపయోగించుకొని, అనంతగిరి పర్వతాల అందాలు, హరిత రిసారట్స్ సౌకర్యాలు, వ్యూ టవర్ కు ఆకర్షితులవుతారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ లిం గ్యా నాయక్ ,టూరిజం ఈ డి ఉపేందర్ రెడ్డి, డి ఇ హనుమంత్ రెడ్డి, కాంట్రాక్టర్ ప్రసాద్ ,సంబంధిత అధికారులు తదితరులుపాల్గొన్నారు.