calender_icon.png 26 August, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద ధర్నా

26-08-2025 12:28:34 AM

మేడ్చల్, ఆగస్టు 25(విజయ క్రాంతి): ప్రజా సమస్యల పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో మేడ్చల్ కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు రమా హాజరయ్యారు.

ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీ ల విషయం మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కొన్ని మాత్రమే అమలు చేస్తూ మొత్తం హామీలను అమలు చేస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు.

అనంతరం ప్రజావాణిలో మెమోరాండం సమర్పించారు. 6 గ్యారంటీల అమలతో పాటు మేడ్చల్లో డిగ్రీ కళాశాల, ప్రతి మండలంలో జూనియర్ కళాశాల, జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మెమోరాండంలో పేర్కొన్నారు.

ఆల్వాల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు త్వరగా పూర్తి చేయాలని, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి, 50వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలని, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి సత్యం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చంద్రశేఖర్, ఏ అశోక్, రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, రాథోడ్ సంతోష్ నరేష్ లింగస్వామి లక్ష్మ ణ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.