calender_icon.png 26 August, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లను మరమ్మతు చేయండి...

26-08-2025 12:27:23 AM

ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేయండి ...బీజేపీ డిమాండ్

తాండూరు, 25 ఆగస్టు, (విజయ క్రాంతి) రోడ్లన్నీ గుంతల మాయమయ్యి ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులు, విద్యార్థినీ, విద్యార్థులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టి పరిష్కరించాలని కోరుతూ పెద్దముల్ భారతీయ జనతా పార్టీ మం డల శాఖ నాయకులు తాసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ కు వినతి పత్రం అందించారు.

ఎన్నికల ముందు ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీలైన ఆరు గ్యారెంటీ స్కీములను ప్రజలకు అందించాలని . .మండల పరిధిలో ఉన్న ఎర్రమట్టి, శుద్ధ, కంకర, తదితర ఖనిజ సంపదను అక్రమ మైనింగ్ కు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ..ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని పేర్కొన్నారు. కోటిపల్లి ప్రాజెక్టు తూములు, కాలువలు మరమ్మత్తులు పూర్తి చేసి రైతన్నలకు సాగునీరు అందించాలని వారు ఇచ్చిన వినతిపత్రంలోకోరారు.