calender_icon.png 26 August, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి

25-08-2025 11:57:40 PM

తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): సోమవారం రోజున వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్   ఆధ్వర్యంలో మిడ్ మానేరు నిర్వాసితుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ నిర్వాసితులకు ఇస్తామని చెప్పిన ఐదు లక్షల 4 వేల రూపాయలు వెంటనే ప్రకటించాలని, ఇండ్ల నష్టపరిహారం రానివారికి, పట్టా ప్యాకేజీలు రాని వారికి, యువతి, యువకులకు పట్టా ప్యాకేజీ వెంటనే అందించాలని వేములవాడ అర్బన్ మండలం నంది కమాన్ చౌరస్తా నుండి వేములవాడ అర్బన్ తహసిల్దార్ కార్యాలయం వరకు  పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి బైక్ ర్యాలీగా వెళ్లి, తాసిల్దార్ కు ఇట్టి సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వానికి చేరే విధంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది.