calender_icon.png 13 November, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు కొత్తగూడేనికి కేటీఆర్

20-05-2024 12:54:19 AM

భద్రాద్రి కొత్తగూడెం, మే 19 (విజయక్రాంతి): వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం క్లబ్‌లో సోమవారం నిర్వహించ నున్న సన్నాహక సమావేశానికి  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నిర్వహించే సమావేశానికి బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.