calender_icon.png 30 October, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్లాల్లో తడిసిన వడ్లు ఆరబెడుతున్న రైతులు

30-10-2025 05:53:06 PM

నకిరేకల్ (విజయక్రాంతి): మొంథా తుఫాను ప్రభావంతో రెండు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా ధాన్యం తడిసి ముద్దయి మొలకెత్తాయి. గురువారం వర్షం వరిపించడంతో నకిరేకల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రైతులు ఉదయం నుండే తడిసిన ధాన్యాన్ని రోడ్ల వెంట కల్లాల్లో సదునుకొని ఆరపెడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కూడ అమ్ముకునే పరిస్థితిలో లేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరిపిస్తదా మళ్ళీ ఏమైనా వర్షం తలపిస్తుందాని రైతులు ఆందోళనలో ఉన్నారు. మ్యచర్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అమ్ముకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మ్యచర్ తో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని  ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు.