calender_icon.png 30 October, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడిసిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి

30-10-2025 05:57:54 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో తుఫాను ప్రభావం వల్ల కురిసిన వర్షాల వల్ల తడిసిన వడ్లు మొక్కజొన్న సోయపంటలను ప్రభుత్వం నిబంధనలను సడలించి కొనుగోలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ డిమాండ్ చేశారు. గురువారం నిర్మల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న పంట పొలాలను కలిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తడిసిన పంటను కొనుగోలు చేయాలని కోరారు. తేమ శాతం నిబంధనలను సడలిస్తే రైతులకు ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం వెంటనే స్పందించి మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేసేలా తీర్మానం చేయాలని కోరారు.