calender_icon.png 31 October, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి కేసులో ముగ్గురు అరెస్టు

31-10-2025 02:03:34 AM

3.5 కేజీల గంజాయి స్వాధీనం 

మణుగూరు, అక్టోబర్ 30,(విజయక్రాంతి) : జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల తో పోలీసులు చేపట్టిన చైతన్యం (డ్రగ్స్ పై యుద్ధం) కార్యక్రమం సత్ఫలితాల నిస్తుంది. ప్రజలలో చైతన్యం రావడంతో గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. గంజాయి పై పోలీసులు ఉక్కుపాదం మోపి ఓ ఇంటిలో నిలువచేసిన 3.5 కిలోలగంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి గురువారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమా వేశంలో వెల్లడించారు.

గాంధీ బొమ్మ సెంటర్ లోని చల్లా శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో గంజాయి నిలువ ఉందనే సమాచారం తో సిఐ ఆధ్వర్యంలో ఇంటిని సోదాచేయగా 3.5 కిలోల గంజాయి లభించింద న్నారు. ఇంటి యజమానిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారన్నారు. చల్ల సతీష్, తన స్నేహితుడు రేపాకుల సాగర్ కలిసి తక్కువ సమయంలో ఎక్కు వ డబ్బులు సంపాదించానే ఆలోచనతో సీలేరు నుండి గంజాయి తీసుకువచ్చి అ మ్ముతున్నారని వెల్లడయిందన్నారు.

ఇంటి యజమాని శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. అంతకు ముందు చల్లా సతీష్, సాగర్ లను ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. గంజాయి అక్రమ రవాణకు పాల్పడినా, విక్రయించినా, గంజాయి సేవించినా కఠిన చర్యలు తప్పవని డిఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో సీఐ పాటి నాగబాబు, ఎస్.ఐ లు శ్రావణ్ కుమార్, నాగేష్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.