calender_icon.png 3 July, 2025 | 4:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా కుతంత్రంపై దలైలామా సంచలన ప్రకటన

03-07-2025 01:45:42 AM

  1. వారసుడి ఎంపిక ప్రక్రియ గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్‌దే
  2. చైనాకు ఆ అధికారం లేదంటూ కుండబద్దలు

టిబెట్, జూలై 2: దలైలామా వారసుడి ఎంపికపై చైనా జరుపుతున్న కుతంత్రంపై టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా సంచలన ప్రకటన చేశారు. 15వ దలైలామా వారసుడి ఎంపిక ప్రక్రియను నిర్వహించే అధికారం గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్‌కు మాత్రమే ఉందని తేల్చిచెప్పారు. ఆ అధికారం చైనాకు లేదంటూ కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమంలో ఒక పోస్టు పెట్టారు.

2011 సెప్టెంబర్ 24నే తాను టిబెట్ బౌద్ధ మత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి తన వారసుడి ఎంపిక కొనసాగించాలా అనే అంశంపై అభిప్రాయాలు కోరినట్లు పేర్కొన్నారు. దీనికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయన్నారు. తన వారసత్వం కొనసాగాలా వద్దా అనే విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని తాను 1969లోనే వెల్లడించినట్టు దలైలామా పేర్కొన్నారు.

తమ అభిప్రాయాల ఆధార ంగా గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్ మాత్రమే దలైలామా పునర్జన్మను నిర్ణయిస్తుందని తె లిపారు. ఈ ప్రక్రియంలో మరెవరికి జోక్యం చేసుకునే అధికారం లేదని తేల్చిచెప్పారు. అయితే టిబెట్‌ను తమ గుప్పిట్లో ఉ ంచుకునేందుకు దలైలామా వారసుడిని ఎ ంపిక చేయాలని చైనా ఎప్పటి నుంచో తాపత్రయపడుతోంది.

దలైలామా వారసుడి ఎ ంపిక ప్రక్రియలో పంచయిన్ లామా పాత్ర చాలా కీలకం. అయితే 1989లో పంచయి న్ లామా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో చైనా ఎత్తుగడను దలైలామా అర్థం చేసుకున్నారు. దలైలామా వయసు 90 ఏళ్లు కావడంతో ఆయన వారసుడి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు.