03-07-2025 01:47:28 AM
అక్రా, జూలై 2: ఐదు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఘనాకు చేరుకున్నారు. ఘనాకు చేరుకున్న మోదీకి ఘనా అధ్యక్షుడు జాన్ మహమ ఘనస్వాగతం పలికారు. 21 గన్ సెల్యూట్‌తో ఆర్మీ సిబ్బంది మోదీకి స్వాగతం పలికారు. గత 30 ఏండ్లుగా ఏ భారతీయ నేత కూడా ఈ దేశంలో పర్యటించలేదు. ఘనాకు చేరుకున్న ప్రధాని మోదీకి భారత సంతతికి చెందని కమ్యూనిటీ సంఘాలు ఘనస్వాగతం పలికారు.
ఘనాకు చెందిన అనేక మంది యుక్తవయస్సు వారు హరే రామ, హరే కృష్ణ శ్లోకాలతో హోరెత్తించారు. వందలాది మంది స్థానిక ప్రజలు.. ‘మోదీ.. మోదీ’, ‘భారత్‌మాతాకీ జై’.. ‘వందేమాతరం’ అంటూ నినదించారు. 70 ఏండ్లుగా 15 వేల మందిపై చిలుకు భారతీయులు ఘనాలో నివాసం ఉంటున్నారు. వీరిలో కొందరికి ఘనా పౌరసత్వం కూడా లభించింది. ఓ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇరు దేశాల అధినేతలు విమానాశ్రయంలోనే సమావేశం అయ్యారు.
‘దక్షిణాన ఉన్న దేశాల్లో ఘనా గొప్ప భాగస్వామి. ఆఫ్రికన్ యూనియన్‌లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ దేశంతో మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాం. పెట్టుబడులు, ఎనర్జీ, హెల్త్, సెక్యూరిటీ, కెపాసిటీ, బిల్డింగ్ అండ్ డెవలప్‌మెంట్ రంగాల్లో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నాం.’
అని ఘనాకు వెళ్లడానికి ముందు మోదీ తెలిపారు. ఘనా నుంచి ప్రధాని ట్రినిడాడ్ అ ండ్ టొబాగో దేశానికి వెళ్లనున్నారు. అనంతరం లాటిన్ అమెరికా దేశమైన అ ర్జెంటీనాకు వెళ్లి.. అక్కడి నుంచి బ్రెజిల్‌లో జ రిగే బ్రిక్స్ సమావేశానికి హాజరవనున్నారు.