08-07-2025 12:56:45 AM
రోడ్ల నిర్మాణాలకు భారీగా నిధులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నిజాంసాగర్, జూలై 7(విజయక్రాంతి): రాష్ట్రంలో గ్రామీణ రోడ్లను మెరుగుపరచాలనే కృత నిర్చయంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళుతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ, సినిమా టో పోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెల చెరువు రోడ్డు, తిమ్మానగర్ వద్ద ఎఫ్ . డి,ఆర్. నిధులు రూ. 4.86 కోట్లతో నిర్మించిన హై లెవెల్ వంతెనను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలకు అధికమొత్తంలో నిధులిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ రోడ్లను మెరుగుపర్చాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందుకు వెళుతున్నారు అని అన్నారు.ప్రభుత్వంపై బురద చల్లి ఎందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తొమ్మిది రోజుల్లోనే 9 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసి దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం అ ని అన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్,బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి స్వాగతం..
జిల్లాకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మండలంలోని నర్సింగ్రావు పల్లి చౌరస్తా వద్ద ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌తో పాటు పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్, మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, జుక్కల్ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
తెలంగాణ వచ్చిన పదేళ్లలో.. బాగుపడ్డది ఆ నలుగురే??
కామారెడ్డి, జూలై 7 (విజయ క్రాంతి), తెలంగాణ వచ్చిన పదేళ్లలో బాగుపడ్డది ఆ నలుగురేనని రాష్ట్ర రోడ్లు భవనాల, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బిచ్కుంద లో బండాయప్ప కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కెసిఆర్ కూతురుతురుకు ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చి నిరుద్యోగులను విస్మరించారన్నారు. వెనుకబడిన నియోజకవర్గం అభివృద్ధి చెందినప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. జుక్కల్ అభివృద్ధి బాధ్యత తనదేనని మంత్రి అన్నారు. మధ్యల చెరువు పిట్లం రోడ్డు తిమ్మనగర్ వద్ద 4.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించారు. బిచ్కుంద డోమ్లి వరకు 13.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
అంతకుముందు విట్లం బిచ్కుందలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ జుక్కల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆనందంగా ఉందని అన్నారు. ఇక్కడి ప్రజల చూపించిన అభిమానానికి ధన్యుడైన అన్నారు. జుక్కల్ లో డైనమిక్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు ఉండాలని ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.
ఆయన తోడుగా ఉంటానని నాకు ఇప్పుడు జుక్కల్ బాధ్యత కూడా తోడైందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇన్చార్జి మంత్రి సీతక్క తో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత పదేళ్లలో కొడుకు, బిడ్డ, అల్లుడు, బాగుపడ్డారు కానీ తెలంగాణ ప్రజలు బాగుపడలేదన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అధికారంలోకి రాకుండా బాధపడలేదని ఏదైతే ఆశయంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లాటి సాధించుకున్నాము అవి నెరవేరాలేదన్నారు. వాళ్లు ఏనాడు కూడా విద్యల గురించి ఆలోచించలేదు అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. పదేళ్లుగా పేదవాడు ఇల్లు కట్టుకోలేదు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు దళితుని సీఎం చేయలేదు కానీ ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం ఐదు లక్షలు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి పేదవారికి అందిస్తున్నమన్నారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కళా సహకారం చేస్తామన్నారు. కాల్ నియోజకవర్గం లో 160 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని జుక్కల్ లాంటి వెనుకబడిన నియోజకవర్గం అభివృద్ధి చెందినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్లున్నారు.
నిరంతరం మమ్మల్ని విమర్శించే హరీష్ రావు వచ్చి జుక్కల్ రోడ్లు చూడాలన్నారు. ఆయన పాత జిల్లాలోని నారాయణ ఖేడ్కు 240 కోట్లతో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు వేశామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రాంత ములోని లెండి నాగమడుగు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నారాయణఖేడ్ జుక్కల్ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తామని పలు సబ్ స్టేషన్లు మంజూరు కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి తాను స్వయంగా కలిసి మాట్లాడుతానన్నారు.
జుక్కల్ లో అడుగడుగునా మంత్రికి జననిరాజనం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ సెట్ కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వన్, ఎస్పీ రాజేష్ చంద్ర, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్, కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నిజాంసాగర్ రోడ్లకు నిధులు మంజూరు చేయండి..
నిజాంసాగర్ జూలై 07(విజయక్రాంతి)ః నిజాంసాగర్ మండలంలోని పంచాయతీరాజ్ రోడ్లను రోడ్లు భవనాల పరిధిలోకి మార్చి నిధులు మంజూరు చేయాలని నిజాంసాగర్ మండల నాయకులు తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి విన్నవించారు.జుక్కల్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా మంత్రి ని స్థానిక శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు,పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ లు కలిసి పలు సమస్యలపై వివరించారు.
ఈ సందర్భంగా వారు నిజాంసాగర్ మండలంలోని పి.ఆర్. (పంచాయతీ రాజ్) కొన్ని రోడ్లను ఆర్ అండ్ బి (రోడ్లు భవనాలు) విభాగంలోకి బదిలీ చేయాలని, మండలంలోని సెంట్రల్ లైటింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రివర్యులను కోరారు. కరీంనగర్ కామారెడ్డి, ఎల్లారెడ్డి హైవేకు అనుసంధానంగా నిజాంసాగర్ మండల కేంద్రంలోని బొగ్గు గుడిసే నుండి నర్సింగ్రావుపల్లి వరకు రోడ్ ను అభివృద్ధి చేసి కొత్త ప్రాజెక్టుగా సాంక్షన్ చేయాలనీ విజ్ఞప్తి చేశారు.అంశాలపై మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి , సంబంధిత శాఖల అధికారులను వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.