08-07-2025 01:44:25 AM
-విత్తన చట్టాన్ని రూపొందించుటకు చర్యలు తీసుకుంటున్నాం
-లక్ష ఐదు కోట్ల రూపాయలతో రైతులకు సంక్షేమ ఫలాలు
-జిల్లా అధికారుల సమిష్టి కృషితోనే రైతులకు నష్ట పరిహారం
-గిరిజన ప్రాంతంలో నకిలీ పదం వినిపిస్తే సహించేది లేదుమంత్రులు తుమ్మలనాగేశ్వరరావు, సీతక్క
ములుగు,జూలై7(విజయక్రాంతి): నకిలీ విత్తనాలతో రైతులు మోసపో వద్దని,విత్తన చట్టాన్ని రూపొందించుటకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ సహకారం, చేనేత, వస్త్రాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు
సోమవారం ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో వాజేడు,వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాల్లో 1521 ఎకరాల్లో మొక్కజొన్న వేసి పంట నష్టపోయిన 671 రైతులకు రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ సహకారం,చేనేత,వస్త్రాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క,తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, తెలంగాణా విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్.అన్వేష్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఏటూరునాగారం ఐటీడిఏ పిఓ చిత్ర మిశ్రాలతో కలిసి 3కోట్ల 80లక్షల 97వేల 264 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాల్లో మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన రైతులందరికీ ప్రైవేట్ కంపెనీల ద్వారా నష్టపరిహారం అందించడం జిల్లా అధికారుల సమిష్టి కృషితోనే సాధ్యమైందని, రాష్ట్రంలోని రైతులకు లక్ష అయిదు కోట్ల రూపాయలు అందించి రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నామని అన్నారు ప్రైవేటు కంపెనీల యజమానుల మెడలు వంచి రైతులకు నష్టపరిహారం అందించడం జిల్లా అధికారుల కృషి ఎన్నటికీ మరువలేమని అన్నారు.
రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అభివృద్ధి ఫలాలను అమలు చేస్తున్నదని,గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కలిగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ములుగు జిల్లాలో పర్యటక ప్రాంతాలు ఉన్నాయని, రానున్న రోజులలో కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామని తెలిపారు మేము అధికారంలోకి వచ్చిన అనంతరం ఇందిరమ్మ రాజ్యం ద్వారా రైతులకు అన్ని సంక్షేమ ఫలాలను అందజేస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఐదు నెలల పోరాట ఫలితంగా నేడు రైతులు ప్రైవేట్ కంపెనీల ద్వారా నష్ట పరిహారం పొందుతున్నారని ఇది చరిత్రలోనే నిలిచిపోతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ పలుసార్లు సమావేశాలు నిర్వహించడమే కాకుండా ప్రైవేట్ కంపెనీలను ఒప్పించడంలో విజయం సాధించ్చారని హర్షం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాలలో లారీల సమస్య అధికమైందని సమస్య పరిష్కారం కోసం జిల్లా పోలీసు యంత్రాంగం తో చర్చించడం జరిగిందని, అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలువురు మోసానికి గురి చేస్తారని తెలిపారు.
దళారీ వ్యవస్థ రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కంకణ బదులు కావాలని పిలుపు నిచ్చారు. 2019 సంవత్సరంలో రైతులు 2 వేల ఎకరాల మిర్చి పంట కోల్పోగా గత పాలకులు ఏ మాత్రం పట్టించుకోకుండా నేడు తాము చేస్తున్న పని తనాన్ని జీర్ణించుకోని కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలను రైతులను ఎవరు మోసం చేసిన నష్టపరిహారం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇది రైతులు సాధించిన విజయం అని ఐదారు నెలలుగా ఈ సమస్య పై పోరాట ఫలితం అని అన్నారు. మల్టీనేషనల్ కంపెనీలతో ఫైట్ చేసి నష్టపరిహారం చెల్లించేలా చూశాం అన్నారు.చాలా కష్టపడి పనిచేశారని కలెక్టర్ దివాకర టిఎస్ ని అభినందిచారు
ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది మంత్రి సీతక్క
ఏటూరునాగారం, జూలై7 (విజయక్రాంతి): ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు చేపడతామని రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
సోమవారం ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణము అంచనా విలువ రూ 55లక్షల పనులను ఎన్ హెచ్ 163 చిన్నబోయినపల్లి నుండి పెద్ద వెంకటాపూర్ వరకు ఒక కోటి 60లక్షల నిధులతో బిటి రోడ్డు నిర్మాణం,షాపల్లి గ్రామంలో 70లక్షల నిధులతో అంతర్గత సిసి రోడ్డు నిర్మాణం పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క,జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తో కలసి శంకుస్థాపన చేశారు చిన్నబోయినపల్లి నేషనల్ హైవే రోడ్డు మార్గంలో వనమహోత్సవంలో భాగంగా కలెక్టర్ తో కలసి మంత్రి మొక్కలను నాటారు.
ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని అన్నారు. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయుటకు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు,అందరు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములై ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. దహలవారిగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు,డ్రైనేజీ నిర్మాణం పనులు చేపడతామని అన్నారు.