08-07-2025 01:11:46 AM
మేడ్చల్ అర్బన్, జూలై 7: గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులో బాసు రేగడి నుంచి గండి మైసమ్మ వెళ్లే ప్రధాన రహదారిలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా తయారైంది. ఒక వైపునకు వంగి, ఏ క్షణమైనా కూలే పరిస్థితిలో ఉంది. ఈ ప్రాంతంలో జనసంచారం ఎక్కువగా ఉంటుంది. ఎం ఎల్ ఆర్, హితం ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు ఈ మార్గంలోనే వెళ్తుంటారు.
విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉన్న విషయమై అనేకసార్లు విద్యుత్ అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదు. విద్యుత్ స్తంభం నేలకొరిగితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుండ బాను చందర్ తెలిపారు. దీనిని వెంటనే సరి చేయాలని ట్రాన్స్కో అధికారులను ఆయన కోరారు.