calender_icon.png 8 July, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

08-07-2025 01:11:21 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై ౭ (విజ యక్రాంతి): పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో  జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, డి ఆర్ డి ఓ దత్తారావు, జిల్లా మహిళా సమాఖ్య సభ్యు లు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటాలని తెలిపారు. జిల్లాకు 51 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని, ఆయా శాఖల అధికారులు తమకు కేటాయించిన లక్ష్యాన్ని సాధించేందుకు రోజువారీగా క్రింది స్థాయి సిబ్బంది నుండి జిల్లా స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని తెలిపారు.

గ్రామపంచాయతీలలోని నర్సరీలు, అటవీ శాఖ నర్సరీలలో అవసరమైన పండ్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయని,ప్రతి ఒక్కరూ వనమహోత్సవం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అర్జీలను త్వరగా పరిష్కరించాలి

-ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం  కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్,ఆర్డీవో లోకేశ్వరరావు తో కలిసి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు వినతులను అందజేశారు.

ఇందిరా మహిళా శక్తి సంబరాలను విజయవంతం చేయాలి

ఇందిరా మహిళా శక్తి సంబరాలను విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లాలో ఇందిరా మహి ళా శక్తి సంబరాల నిర్వహణపై జిల్లా అదనపు కలెక్టర్  డేవిడ్,ఆర్డీవో లోకేశ్వర్ రావు, డిఆర్‌డి ఓ దత్తారావు లతో కలిసి జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, వివిధ మండలాల సమా ఖ్య సభ్యులు, సెర్ప్ ఎ. పి. ఎం.లు, డి. పి. ఎం. లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ వరకు ఇందిర మహిళా శక్తి సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు మహిళా సంఘాల సభ్యుల సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో సంఘాలలో నమోదు కాని మహిళలను గుర్తించి చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల, కార్యదర్శి వనిత, కోశాధికారి కుసుమ, గౌరవాధ్యక్షురాలు శ్రీదేవి, వివిధ మండల సమాఖ్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.