30-08-2024 12:00:00 AM
ప్రియా వడ్లమాని.. పేరు చెప్తే గుర్తు పట్టనివారంతా ‘ఉండిపోరాదే..’ పాట పల్లవిని ఇంట్ ఇస్తే మాత్రం ‘హుషారు’లోని రియా పాత్రధారి కదూ అంటూ ఠక్కున చెప్పేస్తారు. ఔను, ‘హుషారు’లోని ఆ పాట ఈ సొగసరికి అంతటి పేరు తెచ్చిపెట్టింది మరి! ఇటీవల ‘వీరాంజనేయులు విహారయాత్ర’ చిత్రంతో ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులను మరోమారు పలుకరించిన ప్రియ ఒకానొక సందర్భంలో తన గురించి ఇలా చెప్పింది. “నేను మహారాష్ట్ర మూలాలున్న కుటుంబంలో 1997లో పుట్టా ను. పాఠశాల చదువు హైదరాబాద్‌లోనే సాగింది.
డిగ్రీ పూర్తి చేసింది మాత్రం బెంగళూరులో. 2018లో ‘ప్రేమకు రెయిన్ చెక్’ సినిమాతో టాలీవు డ్‌లో అడుగుపెట్టా. నేను నటించిన ‘హుషారు’, ‘శుభలేఖలు’ సినిమాలు కూడా అదే ఏడాది విడుదలయ్యాయి. ఇంకా ‘ఆవిరి’, ‘కాలేజ్ కుమార్’, ‘ముఖచిత్రం’, ‘మను చరిత్ర’ తదితర చిత్రాల్లోనూ నటిం చా. శ్రీవిష్ణుశ్రీహర్ష కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓం భీమ్ బుష్’లో అతిథి పాత్రలో కనిపించా. నాకు సినిమా ఫీల్డ్ అంటే మొదట్నుంచీ చాలా ఇష్టముం డేది.
అయితే నటించడం కంటే ముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించా. తర్వాతే ముఖానికి రంగేసుకున్నా. డ్యాన్స్ మీద ఇష్టంతో చిన్నప్పుడే కూచిపూడిలో శిక్షణ తీసుకున్న. నన్ను రిఫ్రెష్ చేయాలంటే అది డ్యాన్స్ వల్లే సాధ్యమవుతుంది. నేను పెయింటింగ్‌ను కూడా లైక్ చేస్తా.. మనలో ఉన్న రియాలిటీని బయటపెట్టే గొప్ప ఆర్ట్ అది” అని చెప్పింది ప్రియ.