02-01-2026 12:00:00 AM
జహీరాబాద్, జనవరి 1: విజయక్రాంతి దినపత్రిక దినదినాభివృద్ధి చెందాలని శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి, వైరాగ్య శిఖామణి, 1008 అవధూత గిరి మహారాజ్ ఆశీర్వదించారు. గురువారం శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో భక్తులతో కలిసి జహీరాబాద్ విజయ క్రాంతి ఇంచార్జ్ లక్ష్మణ్ యాదవ్ తో కలిసి ఆయన విజయక్రాంతి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవధూత గిరి మహారాజ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికలు పనిచేస్తాయని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచేవే వార్త పత్రికలు అని అన్నారు. కార్యక్రమంలో బర్దిపూర్ గ్రామ సర్పంచ్ రాజు, మాజీ సర్పంచ్ కృష్ణ, మాజీ ఎంపీటీసీ నారాయణ, నాగన్న పటేల్, ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు.