calender_icon.png 2 January, 2026 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్‌కు టీఎన్జీవోస్ శుభాకాంక్షలు

02-01-2026 12:00:00 AM

ఖమ్మం, జనవరి 1 (విజయక్రాంతి): నూతన సంవత్సరం సందర్భంగా గురువారం ఖమ్మం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌లో ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యం లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధికై కలెక్టర్ చేస్తున్న కృషిని యూనియన్ నాయకులు కొనియాడారు. జిల్లా ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించడంలో కలెక్టర్ గారి పాత్ర విశేషమని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజల అభ్యున్నతికి కృషి కొనసాగించాలని కోరారు.

ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులకు పుష్పగుచ్చంతో సత్కరించి,  పదివేల రూపాయల విలువ చేసే వెయ్యి నోటు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో టిఎన్జీ వోస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి కొనిదెన శ్రీనివాస్, అసోసియేటెడ్ అధ్యక్షులు కొమరగురి దుర్గాప్రసాద్, సెంట్రల్ యూనియన్ కార్యదర్శి జెడ్.ఎస్. జైపాల్, టీఎన్జీవోస్ యూని యన్ ఉపాధ్యక్షులు ఎర్ర రమేష్, శ్రీధర్ సింగ్, లలిత కుమారి, అస్లాం ఖాన్, జాయిం ట్ సెక్రెటరీలు తాళ్లూరి శ్రీకాంత్, కోణార్ హరికృష్ణ, భూస చంద్రశేఖర్, రాధికా రెడ్డి, మహిళ కన్వీనర్ మంజుల, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పెద్దినేని రాధాకృష్ణ, టీఎన్జీవోస్ నగర అధ్యక్షులు బెజ్జంకి ప్రభాకర చారి, కార్యదర్శి ఆంజనేయులు, హాస్టల్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు కోటపాటి రుక్మారావు, కార్యదర్శి నాగే శ్వరరావు, మెడికల్ ఫోరం అధ్యక్షులు సైదు లు, మున్సిపల్ ఫోరం అధ్యక్షులు సుధాకర్, పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు ఫజల్, యూనియన్ నాయకులు కొప్పుల దిలీప్, వి.శంకర్, కే.తిరుపతిరావు, ఎస్ కే జిలాని, యాకూబ్, వెంకటరెడ్డి అబ్దుల్ సత్తా ర్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.