calender_icon.png 12 May, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దత్తాత్రేయ జీవితం స్ఫూర్తిదాయకం

10-05-2025 02:33:11 AM

  1. నా జీవితం కూడా ఆయన చేతులమీదుగా ప్రారంభమైంది
  2. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): ఆర్‌ఎస్‌ఎస్‌తో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. బీజేపీలో వివిధ బాధ్యతలను నిర్వ ర్తించి.. ఎంపీగా, కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా అంచెలంచెలుగా ఎదిగిన బండారు దత్తాత్రేయ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలోని మహారాష్ర్ట సదన్‌లో.. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆత్మకథ హిందీ అనువాదం జనతాకీ కహా నీ.. మేరీ ఆత్మకథ పుస్తకాన్ని ఉపరాష్ర్టపతి జగదీప్ ధన్‌కర్ ఆవిష్కరించారు.

కార్యక్రమంలో బిహార్ గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ, కేంద్రమంత్రులు మనోహర్‌లాల్ ఖట్టర్, అర్జున్‌రామ్ మేఘ్వాల్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భం గా కిషన్‌రెడ్డి ప్రసంగించారు. దత్తాత్రేయ జీవితం యువ రాజకీయ నాయకులకు ప్రేరణగా నిలుస్తోందని చెప్పారు. తన రాజకీయ జీవితం కూడా దత్తాత్రేయ చేతుల మీదుగానే ప్రారంభమైందని పేర్కొన్నారు.

దత్తా త్రేయ 4 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి తానిప్పుడు ఎంపీగా ఉన్నానని, తన చేయిపట్టుకొని రాజకీయాలు నేర్పించారని తెలి పారు. సేవాభారతి ద్వారా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మురికివాడల అభ్యున్నతికి ఆయ న చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. 

ఆయన జీవితంలో వివిధ దశల్లో గడించిన అపార అనుభవాన్ని పుస్తకరూపంలోకి తీసుకురావడం నిజంగా అభినం దనీ యమని.. నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణ కేవలం రాజకీయ నాయకులకే కాదు.. దేశ యువతకు ఆదర్శమని తెలిపారు. యు వత ఆయన జీవితం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చని కిషన్‌రెడ్డి వివరించారు.