calender_icon.png 27 August, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందమర్రిలో కోతుల బెడద

12-05-2025 01:26:36 AM

  1. పట్టించుకోని అధికారులు 

ఇబ్బందుల్లో ప్రజలు 

మందమర్రి, మే 11 : పట్టణంలో కోతల బెడద రోజురోజుకు తీవ్రమవుతుంది. కోతు లు గుంపులు గుంపులు గా వచ్చి ఇండ్లపై దాడులు చేస్తూ ఇంట్లోని వస్తువులు, నిత్యావసర సరుకులు చిందరవందర చేస్తున్న ఘటనలు పెరుగుతుండడంతో పట్టణ ప్రజ లు ఆందోళన చెందుతున్నారు.

పట్టణంలోని రామన్ కాలనీ, సిఈఆర్ క్లబ్ ఏరియా, గాంధీనగర్, మార్కెట్ ఏరియా తదితర కాలనీలలో కోతులు గుంపులుగా వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని పలువురు వాపోతున్నారు.  ముఖ్యం గా సిఈఆర్ క్లబ్ సమీపంలోని నాగార్జున కాలనీ, బి క్లాస్ క్వార్టర్స్, తో పాటు గాంధీ నగర్, ఒర్రెగడ్డ ప్రాంతాల్లో కోతుల బెడద అధికంగా ఉందని ఆయా కాలనీల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కోతులు గుంపులుగా ఇండ్లపై దండయాత్రలు చేసి నిత్యవ సర సరుకులను చిందర వందర చేయడంతో పాటు కొన్ని సరుకులను ఎత్తు కెళ్ళి బయట పడేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపట్టి విస్తృతంగా మొక్కలు నాటి వర్షాలు కురవాలి కోతులు వాపసు పోవాలి అంటూ ఆర్భాటంగా ప్రచారం చేపట్టి హరితహారం కార్యక్రమం చేపట్టినప్పటికీ వర్షాల సంగతి పక్కకు పెడితే కోతులు వాపస్ పోకపోవడం అటుంచి కాలనీలలో దండయాత్రలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

కోతుల బెడద మూలంగా ఉదయం పూట ఇండ్ల నుండి బయటకు రావాలంటేనే హడలి పోతున్నామని  ఇంటి తలుపులు తీసి ఉంచి తే చాలు కోతులు ఇండ్లలోకి చేరి భీభ త్సం సృష్టిస్తున్నాయని పలువురు వాపోతున్నారు. కోతుల బెడద మూలంగా ఇళ్లల్లో పెంచుకున్న పూల, పండ్ల మొక్కలు ధ్వంసం అవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోతులు ఇళ్లలోకి రాకుండా చేసే ప్రయత్నంలో అవి ప్రజలపై దాడులు చేసి గాయపరిచిన సంఘటనలు అనేకం ఉన్నాయని,కోతులను పట్టణానికి దూరంగా తరలించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడంలేదని పలువురు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

గతంలో కోల్ బెల్ట్ ప్రాంతాలైన మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, బెల్లంపల్లి వంటి ప్రాంతాల్లో కోతులు ప్రజలపై దాడులు చేసి గాయపరిచిన సంఘటనలు ఉన్నాయని అలాంటి సంఘటనలు పట్టణంలో పునరావృతం కాకుండా కోతుల నుండి ప్రజలను సంరక్షించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

మండలంలో సైతం...

మండలంలోని సారంగపల్లి, శంకర్ పల్లి, మామిడి గట్టు, గుడిపల్లి, పోన్నారం తదితర గ్రామపంచాయతీలలో కోతుల  బెడద అధికమైందని కోతులు ఇళ్లలోకి వచ్చి విలువైన వస్తు సామాగ్రిని చిందర వందర చేస్తు బీ భత్సం సృష్టిస్తున్నా యని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇళ్లలోని వస్తువు లను నాశనం చేయడమే కాకుండా పచ్చని పంట పొలాలపై దాడులు చేస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నాయని మండల రైతులు వాపోతున్నారు. కోతులు స్త్వ్రర విహారం చేయకుండా అటవీ అధికారులు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టి కోతుల బెడద లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కోతుల దాడిలో ఒకరికి గాయాలు

నిర్మల్ మే 11( విజయ క్రాంతి): నిర్మల్ పట్టణంలో కోతుల స్త్వ్రర విహా రం ప్రమాదం కారంగా ఆదివారం ఒకరికి గాయాలయ్యాయి ..నిర్మల్ పట్టణంలోని వెంగ్వాపేట ప్రధాన రహదారికి ఉన్న గాజులపేట శివారు ప్రాంతంలో మహమ్మద్ అన్వర్ ( 49) అనేఆర్ అండ్ బి (సిరిసిల్ల) ఉద్యోగిపై కోతులు దాడి చేసి తీవ్రం గా గాయపరిచాయి. తన ఇంటి వద్ద ఉన్న కోతులను తరిమేందుకు రాళ్ల తో కొట్టగా అవి అతనిపై ప్రతి దాడికి దిగాయి.

దీంతో మహమ్మద్ అన్నవరపు నడుము,చేతులు, భుజాలు కాళ్లపై తీవ్ర గాయాలయ్యా యి. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. తమ ప్రాంతంలో ప్రతిరో జు కోతులు తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వాపోయారు.