17-11-2025 12:31:39 AM
పాట్నా, నవంబర్ 16 : దశాబ్దంన్నర పాటు బీహార్‌ను తన కనుసైగతో శాసించిన ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్‌ను గడ్డు పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఒకవైపు అసెంబ్లీ ఎనికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిందనే అపవాదుతో పాటు ఇప్పుడు కూతుళ్లు కుంపటి పెట్టి ఒకరి వెంట ఒకరు ఇంటిని విడిచి వెళ్తుండడం లా లూను మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
లాలూకు ఉన్న ఏడుగురు కూతుళ్లలో ముగ్గురు రాజ్యలక్ష్మి, రాగిణి, చంద్రలు ఆదివారం కుటుంబాన్ని వీడారు. రెండో కుమా ర్తె రోహిణి శనివారమే కుటుంబాన్ని వీడి సింగపూర్‌కు వెళ్లగా మరో ముగ్గురు కూడా ఇంటి నుంచి వెళ్లిపోవడం లాలూను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. వీరంతా తమ పిల్లలతో కలిసి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఒకప్పుడు బీహార్‌లో ప్రధాన రాజకీయ కేంద్రంగా ఉన్న లాలూ ఇల్లు.. ఇప్పుడు బోసిబోయింది.
లాలూకు తొమ్మిది మంది సంతానం
లాలూ దంపతులకు తొమ్మిది మంది సంతానం. వారిలో మీసా భారతి పె ద్ద కూతురు కాగా రోహిణి, చంద్ర, రాగిణి యాదవ్, హేమా యాదవ్, అనుష్కారావు (ధన్ను), రాజ్యలక్షిలు మిగతా కుమార్తెలు. తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీయాదవ్ కుమారులు ఉన్నారు. వీరిద్దరు బీహార్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఇందులో తేజ స్వీ యాదవ్ ఆర్జేడీలోనే కొనసాగుతుండగా తేజ్ ప్రతాప్ యాదవ్ మాత్రం జనశక్తిజనతాదళ్ పార్టీని స్థాపించి వేరు కుంపటి పెట్టుకున్నాడు.
నాన్నకు కిడ్నీ ఇచ్చి చెడ్డదాన్నయ్యాను
నాన్నకు కిడ్నీ ఇచ్చి చెడ్డదాన్ని అయ్యాను అంటూ ఆర్జేడీ అధినేత రెండో కుమార్తె రోహిణీ ఆచార్య సంచలన ఆరోపణ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో తన కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. ‘ తేజస్వీ ఆయన సహాయకులే నన్ను బయటకు పంపారు. ‘ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి సంజయ్ యాదవ్, రమీజ్ యాదవ్‌లే కారణం.. వారి పేర్లు తీస్తే వెంటనే ఇంటి నుంచి తోసేస్తారు, దుర్బాషలాడతారు. కొట్టేందుకు చెప్పులు కూడా తీస్తారు..
నన్ను కూడా అలానే చేశా రు. నన్ను కుటుంబం నుంచి బహిష్కరించా రు. నాకంటూ కుటుంబం లేదు. మీరు ఏదై నా అడగాలంటే తేజస్వీ యాదవ్, రమీజ్‌ను అడగండి వాళ్లందరూ ఒక్కటై నన్ను నా కు టుంబం నుంచి వేరు చేశారు. అని సింగపూర్ వెళ్తూ పాట్నా ఏయిర్ పోర్టులో ఆమె వాపోయారు.
ఆ తర్వాత ఆమె తీవ్ర భావోద్వేగ సోషల్ మీడియా పోస్టులో తాను అస భ్యకర తిట్లకు గురయ్యానని, తేజస్వీ యాద వ్ సన్నిహితులైన ఎంపీ సంజయ్ యాదవ్, రమీజ్ అనే సహాయకుడితో జరిగిన వాగ్వాదంలో తనను చెప్పుతో కొట్టడానికి కూడా ప్రయత్నించారని ఆరోపించారు. నాన్నకు ‘కిడ్నీ దానం చేసినందుకు రూ.కోట్లు తీసుకున్నాను’అంటూ అవమానించారని పేర్కొన్నా రు. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు.