23-11-2025 12:31:55 AM
ఫ్లెక్సీని ఏర్పాటు చేసినందుకు పోలీసుల చర్యలు
వరంగల్ (మహబూబాబాద్), నవంబర్ 22 (విజయక్రాంతి): మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఫ్లెక్సీని గ్రామంలో ఏర్పాటు చేసి, నివాళులర్పించినందుకు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమకొండ జిల్లా వేలే రు మండలం షోడశపల్లి గ్రామంలో హిడ్మా ఫ్లెక్సీ ఏర్పా టు చే యడం నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతు పలికినట్లేనని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు పా ల్పడ్డ గ్రామానికి చెందిన కొయ్యడ సురేష్, మేక బుచ్చయ్యలపై కేసు నమోదు చేసినట్లు వేలేరు ఎస్సై సురేష్ తెలిపారు.