16-09-2025 12:56:33 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఆశా వాహులకు అధిష్టానం గుడ్ న్యూస్ చెప్పనుంది. డీసీసీ కమిటీల నియామకంపై కస రత్తు తుది దశకు చేరుకున్నది. రెండు, మూడు రోజుల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవులను ప్రకించేందుకు సిద్ధ్దమైంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జ్‌లు, పార్లమెం ట్ నియోజక వర్గాలకు చెందిన కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌లతో సమావేశమై అభిప్రాయలు తీసు కున్నారు.
ఏఐసీసీ ఆదేశాలు, ముఖ్య నేతల సలహాలు, సూచనల మేరకు డీసీసీ కమిటీల కూర్పుపై తుది నిర్ణయానికి వచ్చినట్లు గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి. డీసీసీ కమిటీల కూర్పు విషయంలో బేదాభిప్రాయ లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.