19-07-2025 12:20:22 AM
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయంలో ఈ నెల 20న నిర్వహించే బోనాల జాతర ఏర్పాట్లను డిసిపి భాస్కర్ ఏసీపీ రవికుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డిసిపి భాస్కర్ మాట్లాడుతూ... బోనాల పండుగ సందర్భంగా పటిష్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా బోనాల జాతరను జరుపుకోవాలని సూచించారు.