calender_icon.png 19 July, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూములను రక్షించండి

19-07-2025 12:20:29 AM

 సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య

 కలెక్టర్ నారాయణరెడ్డి వినతి పత్రం అందజేసిన నేతలు

అబ్దుల్లాపూర్‌మెట్, జులై 18: ప్రభుత్వ భూములను రక్షించాలని సీపీఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని.. ఆ భూమిని రక్షించాలని సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం పగడాల యాదయ్య మాట్లాడు తూ.. కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములను రక్షించాలన్నారు.

అబ్దుల్లాపూర్ సర్వే నెంబర్ 283లో దాదాపు 80 ప్రభుత్వ భూమి ఉంటుంది. ఈ భూమి విలువ కోట్లాది రూపాయాలు. 2006లో ప్రభుత్వం పీవోటీ కింది తీసుకున్నప్పటికీ కొంత మంది దళారులు, రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కోర్డు ఆర్డర్ సాకు చూపించి.. యథేచ్చగా కబ్జాలు చేస్తున్నారని అన్నారు. ప్లాట్లుగా మార్చి ఫ్రీ కాస్ట్‌తో కంపౌండ్ వాల్ నిర్మించారని అన్నారు.   

గతంలో తహసీల్దార్ ఆఫీసు ముందు ఇండ్లు నిర్మించుకుంటే ఆ నిర్మాణాలను గతేడాది అధికారు లు కూల్చివేశారు కానీ పక్కనే ఉన్న ఫ్రీ కాస్ట్ కంపౌండ్లను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమిలో ఇండ్లు నిర్మించుకుంటున్నా.. ఎవ్వరు పట్టించుకోవడం లేదన్నారు. రియల్ ఎస్టేట్స్ వ్యాపారస్తులు, దళారీలు కలిసి ప్లాట్లు చేసి లక్షలాది రూ పాయలకు విక్రయిస్తున్నప్పటికీ అధికారులు ఏమీ చేస్తున్నారని ప్రశ్నించారు.

ప్రభుత్వ భూములను రక్షించి స్థానిక నిరుపేదల వ్యవసాయానికి కానీ ఇంటి స్థలాలకు ఇవ్వాలని సీపీఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్‌మెట్ సీపీఎం మం డల కార్యదర్శి ఏర్పుల నర్సింహా, వరకాల ముత్యాలు, ఎలకపల్లి మహేశ్, బలరాజు, సత్తయ్య, బిక్షపతి, తదితరులుపాల్గొన్నారు.