calender_icon.png 8 July, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హయత్‌నగర్ డివిజన్‌లో డీసీ పర్యటన

08-07-2025 01:03:37 AM

ఎల్బీనగర్, జులై 7 : హయత్ నగర్ డివిజన్ లోని లక్ష్మీప్రియా కాలనీలో సో మవారం అధికారులతో కలిసి డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పర్యటించి, స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. కాలనీలో నెలకొన్న శానిటేషన్, విద్యుత్ దీపాల సమస్యలను పరిష్కరించాలని అధికారులను కాలనీవాసులు కోరారు. కాలనీలోని ఓపెన్ ప్లాట్ లోని గుడిసెలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి తరచూ అగ్రి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

గుడిసెల్లో నివాసం ఉంటున్నవారికి అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీసీ యాదయ్య సూచించారు. వీలైనంత త్వరగా కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో శానిటేషన్ డీఈ నీలిమ, ఎస్‌ఎస్ చంద్రశేఖర్, జవాన్ రామచంద్ర, శానిటేషన్ సూపర్ వైజర్లు నగేష్, యాదయ్య, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు మధు, శ్రీధర్ గౌడ్, ఉపేందర్ గౌడ్, పరుషరాములు, మురళి, అచ్చి రెడ్డి, వెంకటేష్, శ్రీనువాసు రెడ్డి, నిరంజన్, నరేశ్, జలంధర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, శేఖర్ తదితరులుపాల్గొన్నారు.