08-07-2025 01:02:53 AM
కాగజ్‌నగర్, జూలై ౭ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం తీసుక వచ్చిన జీవో 282 రద్దు చెయ్యాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమ వారం కాగజ్‌నగర్ రాజీవ్‌గాంధీ చౌరస్తాలో ఆ జీవో ప్రతులను దగ్ధం చేశారు.
ఈ సంద ర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రోజుకి 8 గంటల పని విధానాన్ని మారుస్తూ 10 గంటలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 282ను ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల న్నారు. ఆ జీవో యాజమాన్యాలు, దోపిడినీ మరింత పెంచుకోవడానికి ఇచ్చిన ఆయు ధంగా పేర్కొన్నారు.
ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీ విధానాలకు తాము వ్యతిరేకమని చెప్తూనే మోదీ తెచ్చిన లేబర్ కోడ్ లలో పేర్కొన్న అంశాలను చాప కింద నీరులా ఇక్కడ సీఎం అమలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 9న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్ర మంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శం కర్, త్రివేణి జిల్లా కమిటీ సభ్యులు చంద్ర య్య నాయకులు శంకర్. మల్లేష్. రమేష్. అశోక్. లక్ష్మణ్. శ్రీనివాస్. సత్యం.వై అరుణ. తదితరులు పాల్గొన్నారు